Siva Karthikeyan | శివకార్తికేయన్ ‘మహావీరుడు’ షూటింగ్ ప్రారంభం.. గెస్ట్‌గా స్టార్ డైరెక్టర్?
Mahaveerudu Movie Shooting Begins | తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస హిట్లతో తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ తన తదుపరి సినిమాను ప్రారంభించాడు.
శివకార్తికేయన్ తన తదుపరి సినిమాను మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. మహావీరుడు అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభోత్సవానికి దిగ్గజ దర్శకుడు శంకర్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా శంకర్ కుమార్తె అధితి శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు మిష్కిన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. శాంతీ టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భరత్ శంకర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫి: విధు అయ్యన్న, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్.
#Maaveeran / #Mahaveerudu shoot began yesterday. Thank you @shankarshanmugh for gracing us with your presence! 🙏🏼😇@Siva_Kartikeyan @AditiShankarofl @madonneashwin @iamarunviswa @vidhu_ayyanna @philoedit @bharathsankar12 @Kumar_gangappan @LokeshJey @DoneChannel1 pic.twitter.com/6zCRzrOfDR
— Shanthi Talkies (@ShanthiTalkies) August 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

