Sitara: మీరు ప్రపంచానికి సూపర్ స్టార్, మాకు మాత్రం మీరే ప్రపంచం: సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఇక అభిమానులు అయితే మహేష్‌కి సంబంధించి ట్యాగ్లు క్రియేట్ చేసి అవి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మహేష్ జపమే చేస్తుండగా, తన తండ్రి బర్త్ డే సందర్భంగా సితార చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
మహేష్- నమ్రతల గారాల పట్టి సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్రపంచం! పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు మాతో సరదగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎప్పుడు మిమ్నల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని సితార తన కామెంట్లో తెలిపింది.
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇప్పటికే సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ విడుదల కాగా, ఇది ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ టీజర్‌లోని డైలాగ్స్, మహేష్ లుక్ ఫ్యాన్స్ కి పూనకం తెప్పిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా మరిన్ని అప్డేట్స్ నేడు రానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Mahesh babu
- namrata
- Sitara
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

