బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి ఇది చివరి వారం కావడంతో హౌజ్‌మేట్స్‌కి ఎమోషనల్ జర్నీ వీడియోలు చూపించారు బిగ్ బాస్. ఇప్పటికే సన్నీ, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్ వీడియోలు చూపించగా, లేటెస్ట్ ఎపిసోడ్లో సిరి వీడియో చూపించారు. ‘సిరి అంటే ఏంటో ప్రపంచానికి చూపాలనే తపన.. ఈ ప్రయాణంలో కళ్లకి కట్టినట్టు అందరికీ కనిపించింది.. ఈ ఇంట్లో మీరు ఏర్పరచుకున్న బంధాలు.. దగ్గరైన మనుషులు.. మీలోని ఆ భావాలను తట్టిలేపారు.
మీ బుద్దిబలంతో టాస్క్‌లు ఆడి.. ఎవరికోసం త్యాగం చేయకుండా.. చివరి వరకూ ప్రయత్నించారు. ఇంత ధైర్యంగా ఉండే సిరి.. వివిధ సంఘర్షణలతో ఒంటరి తనాన్ని ఎంచుకున్నారు.. మీ కన్నీళ్లు ఆ విషయాన్ని మౌనంగా చెప్పాయి.. మీ నవ్వు చేసిన సందడిలో మీ కన్నీళ్లు ఇంకిపోయాయి.. పిట్ట కొంచెం కూత ఘనం మీ విషయంలో నిజం అని అందరికీ నిరూపించారు.
సిరి మీ సందడి బిగ్ బాస్ ఇంటికే కళని తీసుకుని వచ్చింది.. బిగ్ బాస్ భావోద్వేగాల నిధి అయితే.. అందులో సిరి మీరు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు బిగ్ బాస్. ఆ తరువాత జర్నీ వీడియో ప్లే చేయగా.. అందులో చాలా వరకూ సిరి-షణ్ముఖ్‌లు అలకలు.. హగ్‌లు.. ముద్దులే ఉన్నాయి.