బిగ్ బాస్ హౌజ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జంట షణ్ముఖ్-సిరి. వీరిద్దరు గత కొద్ది రోజులుగా విమర్శల పాలవుతున్నారు. నాగార్జున కూడా వీరిని రీసెంట్గా హెచ్చరించాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని సిరి..షణ్ముఖ్‌కి ఓ పంచ్ ఇచ్చింది. హౌజ్ లో నాగార్జున డైలాగ్ గురు అనే గేమ్ ఆడించగా.. మొదటగా వచ్చిన మానస్.. నన్ను రెచ్చగొట్టకు అనే డైలాగ్‌ను సన్నీకి ఇచ్చాడు. ఎవ్వరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకు అని అన్నాడు.
ఆ తరువాత షన్ను వచ్చి.. నమ్మకం లేదు దొర అనే డైలాగ్‌ను రవికి ఇచ్చాడు. సర్లే సర్లే ఎన్నో చూశాం అనే డైలాగ్‌ను షన్నుకి రవి ఇచ్చాడు. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో అట్ కమల్ హాసన్ అనే డైలాగ్‌ను రవికి ఆనీ మాస్టర్ ఇచ్చింది.ఓన్లీ వన్స్ ఫసక్ అనే డైలాగ్‌ను మానస్‌కు ప్రియాంక ఇచ్చింది.. టాస్కులో దిగినే అంతే సర్ అని కారణం చెప్పింది ప్రియాంక. సిరి, షన్నుల హగ్స్ గురించి శ్రీరామచంద్ర కౌంటర్లు వేస్తూ.. ఏమో సర్ నాకు కనపడదు అనే డైలాగ్‌ను షన్నుకు శ్రీరామచంద్ర ఇచ్చాడు.
ఇవే తగ్గించుకుంటే మంచిది అనే డైలాగ్‌ను షన్నుకి సిరి ఇచ్చింది. ఇవే.. మనం హగ్గులు తగ్గించుకుంటే ఇద్దరికీ మంచిది అని సిరి అంటుంది. అబ్బ ఎంత కరెక్ట్‌గా చెప్పావో అంటూ సిరి, షన్నులకు నాగార్జున కౌంటర్ వేశాడు. ఇది ఎంత వరకు నిజం చేస్తారో అని అందరు అనుకుంటున్నారు. నీ బొందరా బొంద అనే డైలాగ్‌ను శ్రీరామచంద్రకు కాజల్ ఇచ్చింది. అయిపాయే అనే డైలాగ్‌ను రవికి సన్నీ ఇచ్చాడు. అలా మొత్తానికి ఆ టాస్క్ కూడా పూర్తయింది.