Siri: చేసిన తప్పుకి కుమిలిపోయి గుంజీలు తీసిన సిరి

బిగ్ బాస్ సీజన్ 5లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జంట సిరి-షణ్ముఖ్. వీరిద్దరిపై బయట ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సిరి ప్రవర్తన ఎవ్వరికి నచ్చలేదు. త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వేరే వ్యక్తితో ఇలా ప్రవర్తించడమేంటని మండిపడుతున్నారు. అయితే సిరి వ్యవహారంపై ఆయన ప్రియుడు ఎలా స్పందిస్తాడా అని అందరు ఎదురు చూస్తున్న క్రమంలో బిగ్ బాస్ స్టేజ్‌పై ఆయన హుందాగా వ్యవహరించిన తీరు అందరిని కట్టిపడేసింది.
శ్రీహాన్ ని కలిసేందుకు అతను ఇచ్చిన బ్రేస్‌లెట్‌ని త్యాగం చేసింది సిరి. దీంతో అతడు స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడిన ప్రతి మాట ఒక తూటా పేలింది.. పాడిన పాట సైతం గుండెల్ని పిండేసింది. హౌస్‌లో ఉన్న వాళ్ల కళ్లు తెరిపించింది. శ్రీహాన్‌ని స్టేజ్ మీద చూడగానే సిరి ముఖం చెల్లలేదు. బోరున ఏడ్చేసింది. ఆమెను చూసి శ్రీహాన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే తాను చేసింది తప్పని తెలుసుకున్న సిరి.. గుంజీలు తీసింది. దానికి ఏయ్ సిరి అని ఆపిన శ్రీహాన్.. ‘నీలో నువ్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నావ్.. నువ్ ఫీల్ కావడానికి ఏం లేదు.. గేమ్ బాగా ఆడు అని చెప్పాడు.
బయటకు రావాలంటే డోర్స్ ఉన్నాయి. బాత్ రూంలోకి వెళ్లి గోడల్ని ఎందుకు బద్దలు కొడుతున్నావ్. మైండ్‌లో నుంచి పిచ్చి పిచ్చి తాట్స్ తీసెయ్. నేను నిన్న అర్థం చేసుకుంటున్నా.. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా అని చెప్పాడు. టాప్ 5 పెట్టాలని శ్రీహాన్‌ని నాగార్జున కోరినప్పుడు.. సిరిని పక్కన పెట్టి సన్నీకి తొలిస్థానం ఇచ్చాడు. ఆ తరువాత షణ్ముఖ్‌కి రెండో స్థానం ఇచ్చాడు. అయితే షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ అతని చెంప చెల్లుమనే మాట మాట్లాడాడు శ్రీహాన్. ‘సిరి పక్కన నేను లేకపోయినా.. నా ఫ్రెండ్ ఒకడు సిరికి తోడుగా ఉన్నాడు.. ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే ధైర్యంతో ఉన్నాను’ అని చెప్పాడు..
మూడో స్థానంలో రవి ఫొటో పెట్టిన శ్రీహాన్.. నాలుగో స్థానంలో శ్రీరామ్ ఫొటోపెట్టాడు.. నువ్ అమ్మాయిల్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నావ్.. త్వరలో దుబాయ్ వెళ్తావేమో అని అన్నాడు.. శ్రీరామ్‌తో లవ్ ట్రాక్ నడిపిన హమీదాది దుబాయ్ కావడంతో ఈ పంచ్ వేశాడు శ్రీహాన్. ఇక ఐదో స్థానంలో ఏ ఫొటో పెట్టాలని ఆలోచిస్తుండగా.. సిరి ‘కన్నా నా ఫొటో పెట్టుకన్నా’ అని అడిగింది. దీంతో శ్రీహాన్ సిరికి ఐదో స్థానం ఇచ్చాడు. నువ్ నీ గేమ్ ఆడు.. ఎంత చేయాలో అంతే చేయి అతి చేయకు’ అని చురక వేశాడు శ్రీహాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

