Sing Geetham | థియేటర్లలో ప్రశంసలు అందుకున్న ‘సింగ్ గీతం’.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sing Geetham | దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన వినూత్న చిత్రం 'సింగ్ గీతం' థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తనదైన కథనం, సరికొత్త ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Sing Geetham | దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన వినూత్న చిత్రం ‘సింగ్ గీతం’ థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తనదైన కథనం, సరికొత్త ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్ అండగా నిలుస్తూ, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. 2026 జూన్ 12న విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని నమోదు చేయకపోయినా, కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన అహల్య, అయాన్, షాలిని కొండేపూడి తమ సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ముఖ్యంగా కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, వినూత్న కథనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ‘సింగ్ గీతం’ డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తన ‘కమింగ్ సూన్’ జాబితాలో ఈ చిత్రాన్ని చేర్చింది. దీంతో జూలై 9, 2026 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా వెల్లడైంది. వివిధ ప్రాంతాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని పలు భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీప్రియులు ఇప్పుడు ఇంట్లోనే వీక్షించే అవకాశం పొందనున్నారు.
పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు మరింత బలం చేకూర్చాయని ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయపడ్డారు.థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సింగ్ గీతం’ ఓటీటీ విడుదల తర్వాత మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందుతుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వినూత్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Devi Sri Prasad
- Jr NTR
- netflix
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

