Godfather vs The ghost | గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ కథల మధ్య ఇన్ని పోలికలున్నాయా..?
జాగ్రత్తగా గమనిస్తే గాడ్ ఫాదర్ (Godfather), చిరంజీవి, ది ఘోస్ట్ (The Ghost) సినిమా కథల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే రెండు సినిమాల కథలు దాదాపు సేమ్ టు సేమ్ ఉన్నాయి.
ఒకటి పూర్తిగా పొలిటికల్ డ్రామా..మరొకటి పూర్తిగా యాక్షన్ సినిమా..ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారా..? కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే చిరంజీవి, నాగార్జున సినిమా కథల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే రెండు సినిమాల కథలు దాదాపు సేమ్ టు సేమ్ ఉన్నాయి.
ఒక్కసారి గాడ్ ఫాదర్ (Godfather)సినిమా కథ విషయానికి వస్తే..ఇందులో అనుకోకుండా ముఖ్యమంత్రి చనిపోతే..ఆయన అల్లుడు సీఎం అవ్వడానికి ఎన్నో కుట్రలు చేస్తాడు. అలాంటి సమయంలో బయట నుంచి అన్నయ్య తన చెల్లిని కాపాడుకోవడానికి..అలాగే పార్టీని నిలబెట్టడానికి ముందుకు వస్తాడు. ఇక్కడ ఆ అన్నయ్య చిరంజీవి (Chiranjeevi)అయితే.. చెల్లెలు నయనతార. గాడ్ ఫాదర్ కథంతా పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా చుట్టూ తిరుగుతుంది.
ఇప్పుడు ది ఘోస్ట్ (The Ghost)విషయానికి వస్తే.. ఇక్కడ కూడా దాదాపు సేమ్ టు సేమ్. కాకపోతే ఇక్కడ పాలిటిక్స్ ఉండవు.. బిజినెస్ ఉంటుంది. ఒక పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న నాగార్జున (Nagarjuna) అక్క..ఆయన చనిపోయిన తర్వాత ఆ వ్యాపారాన్ని మొత్తం చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ల తాత గారి చిన్న భార్య వారసులు నాగార్జున అక్క కంపెనీని.. వ్యాపారాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తారు.
ఈ క్రమంలోనే వాళ్లను చంపడానికి మాఫియాతో సంబంధాలు పెట్టుకుంటారు. ఆ సమయంలో తన కాపాడేది తమ్ముడు మాత్రమే అని తెలిసి నాగార్జునకు ఫోన్ చేస్తుంది అక్క. అప్పుడు అక్కడికి వచ్చి ఆమె బిజినెస్ తో పాటు వాళ్ళను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. ఇక్కడ కూడా ఫ్యామిలీ డ్రామానే. ఈ రెండు సినిమాల్లో ఉన్న మరో కామన్ పాయింట్ మాఫియా.. అండర్ వరల్డ్.. డ్రగ్స్. ఇది ఇటు చిరంజీవి సినిమాలో..అటు నాగార్జున సినిమాలో కామన్ గా కనిపిస్తాయి.
అక్కడ పొలిటికల్ చుట్టూ ఇవన్నీ తిరిగితే.. ఇక్కడ బిజినెస్ బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. అలా ఒకే పండక్కి తెలియకుండా ఒకే సబ్జెక్టుతో వచ్చారు చిరంజీవి, నాగార్జున.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

