వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సిల్క్ శారీ’. టి.నాగేందర్ దర్శకుడు. కమలేష్ కుమార్, రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్ నిర్మాతలు. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాను. రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. కథానుగుణంగా చక్కటి టైటిల్ కుదిరింది’ అన్నారు. వినూత్నమైన ప్రేమకథా చిత్రమిదని హీరో వాసుదేవ్ రావు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సనక రాజశేఖర్, సంగీతం: వరికుప్పల యాదగిరి.