DJ Tillu | ముప్పై కోట్ల క్లబ్లో సిద్దూ జొన్నలగడ్డ.. ‘డిజే టిల్లు’ ఫైనల్ కలెక్షన్స్
సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం 'డీజె టిల్లు'. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.
DJ Tillu Final collections | సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డీజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. డీజె టిల్లు చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. సిద్దూ జొన్నలగడ్డ నటన, సంభాషణలు పలికిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చిత్రం నుంచి విడులైన పాటలు ట్రైలర్ యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. విడులైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. పోటిగా ఖిలాడి,ఎఫ్ఐఆర్ సినిమాలు ఉన్న ప్రేక్షకులు డిజే టిల్లుకే ఓటేసారు. ఈ చిత్రానికి వచ్చిన ఫైనల్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే..
నైజాం : 7.11 కోట్లు
సీడెడ్ : 1.88 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.39 కోట్లు
ఈస్ట్ : 0.79 కోట్లు
వెస్ట్ : 0.80 కోట్లు
నెల్లూరు : 0.46 కోట్లు
కృష్ణ : 0.66 కోట్లు
గుంటూరు : 0.77 కోట్లు
తెలంగాణ+ఏపి : 13.86 కోట్లు (24.04 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్ : 2.05 కోట్లు
కర్ణాటక+రెస్ట్ఆఫ్ఇండియా : 1.01 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 16.92 కోట్లు (30.12 కోట్ల గ్రాస్)
‘డిజే టిల్లు’ చిత్రానికి 8.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 9.2 కోట్లతో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా 16.92కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి 2022లో మొదటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్దూ జొన్నలగడ్డ 30 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ చిత్రం ‘ఆహా’లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

