Siddhu Jonnalagadda | గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). డీజే టిల్లు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు 2 (Tillu Square)తో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు సిద్దు. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది.
పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన డైరెక్షన్లో సిద్దు సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. నీరజ కోన (Neeraja Kona) వినిపించిన స్టోరీ లైన్ సిద్దును ఇంప్రెస్ చేసిందట.స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో ఫిల్మ్ మేకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుందట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రొమాంటిక్ జోనర్లో సాగేలా సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్.