యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డను తన సొంత పేరుతో కంటే ‘టిల్లూ’ అనే ఎక్కువమంది పిలుస్తుంటారు. ‘డీజే టిల్లు’గా ఆయన అంతగా రిజిస్టరైపోయారు జనాల్లో. ఏదేమైనా సిద్దుకి కామెడీ బాగా కలిసొచ్చింది. అందుకే.. ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీని మించే మరో కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. ఈ తాజా సినిమాకు ‘లుంగీ మ్యాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట.
అనిల్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. ‘డీజే టిల్లు’ మాదిరిగానే హైదరాబాద్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నట్టు వినికిడి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే గప్‌చుప్‌గా జరిగాయట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.