సిద్ధార్థ్‌రాయ్ ప్రేమకథ
దీపక్ సరోజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్'. వి.యశస్వీ దర్శకుడు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. మంగళవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో సిద్ధార్థ్ రాయ్ బాల్యం నుంచి ఇరవై ఏళ్ల వయసు వరకు జీవితాన్ని ట్రైలర్లో చూపించారు.
దీపక్ సరోజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి.యశస్వీ దర్శకుడు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. మంగళవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో సిద్ధార్థ్ రాయ్ బాల్యం నుంచి ఇరవై ఏళ్ల వయసు వరకు జీవితాన్ని ట్రైలర్లో చూపించారు. ఓ దశలో ఎలాంటి భావోద్వేగాలు లేని సిద్ధార్థ్‌రాయ్ అనుకోని సంఘటనల వల్ల కోపస్వభావిగా, అహంకారిగా మారతాడు. అవే అతని పాలిట శత్రువులవుతాయి.
ఈ నేపథ్యంలో అతను పడే సంఘర్షణతో ట్రైలర్ ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో దీపక్ సరోజ్ మెప్పించాడు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మట్లాడుతూ..ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదని, ఈ తరహా సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. దర్శకుడు వి. యశస్వీ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌గారు తన బ్యానర్లో నా తదుపరి సినిమాకు అవకాశమిచ్చారు. ‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. తన క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటీ ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తుందని హీరో దీపక్ సరోజ్ తెలిపారు. రొటీన్‌కు భిన్నమైన కథతో తాము చేస్తున్న ప్రయత్నం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: రధన్, నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్పూడి, సుధాకర్ బోయిన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి.యశస్వీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ ఔట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

