కళపై ప్రేమే కలిపింది
ఆర్టిస్టు శంతను హజారికాతో గత కొంతకాలంగా ప్రేమాయణాన్ని నడుపుతున్నది సీనియర్ నాయిక శృతిహాసన్. ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారు. తొలిసారిగా తమ బంధంపై పెదవి విప్పింది శృతిహాసన్. కళలపై ప్రేమ, సినిమా పట్ల ఉన్న ఆరాధనా భావమే ఇద్దరిని కలిపిందని చెప్పింది. గతంలో తాను డేటింగ్ చేసిన వ్యక్తుల్లో నిజాయితీ కొరవడటం వల్లే ఆ బంధాలకు స్వస్తి పలికానని చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘శంతను హజారికా లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అతని చిత్రకళా ప్రతిభ నాలో స్ఫూర్తినింపింది. గొప్ప సృజనశీలి అయినప్పటికి అతనిలో కించిత్ గర్వం కూడా కనిపించదు. చాలా సౌమ్యంగా ఉంటారు. ఇక సంగీతం, సినిమా అంటే ప్రాణం పెడతారు.
మా ఇద్దరి అభిరుచులు ఒకటే. అందుకే ప్రేమలో పడ్డాం. గతంలో నేను ఇండస్ట్రీకి చెందిన వారితో ప్రేమలో పడ్డా..కానీ వారెవరూ నాలోని కళాత్మకతను అర్థం చేసుకోలేకపోయారు. సినిమా బయటి వ్యక్తి అయిన శంతను నన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

