Nani | దసరాతో నాని తిరుగులేని విజయం సాధించాడు. ప్రస్తుతం అదే జోష్తో నాని30 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా నాని మరోసారి తండ్రి పాత్రలో నటించనుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమాలో శృతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ మీదున్న శృతి ప్రస్తుతం తెలుగులో సలార్ సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు నాని సినిమాలో కీలకపాత్ర పోషించనుండటంతో ఎక్కడలేని ఆసక్తి క్రియేట్ అయింది. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నానికి జోడీగా మృనాళ్ థాకూర్ నటిస్తుంది.