అగ్ర కథానాయిక శృతిహాసన్ కేవలం నటనకే పరిమితం కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుంటున్నది. సంగీతంపై ఈ భామకు ఉన్న ఆసక్తి గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో తన గాత్రంతో ఆకట్టుకుందీ భామ. అలాగే లిరిక్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం శృతిహాసన్.. ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమా కోసం నాలుగు దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నది శృతిహాసన్. ఇప్పటికే మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిందని తెలిసింది. ఐదు భాషల్లో ఆమెకు మంచి పట్టు ఉండటంతో డబ్బింగ్ సాఫీగా సాగిపోతున్నదని చిత్ర బృందం పేర్కొంది.