Shraddha Kapoor | మనసు తీసుకో.. నిద్ర ఇచ్చెయ్!
అందంతోపాటు అభినయం ఆమె సొంతం. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి.. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు శ్రద్ధా కపూర్. బీటౌన్‌లో హీరోయిన్లపై రూమర్లు సాధారణమే.
Shraddha Kapoor | అందంతోపాటు అభినయం ఆమె సొంతం. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి.. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు శ్రద్ధా కపూర్. బీటౌన్‌లో హీరోయిన్లపై రూమర్లు సాధారణమే. అయితే, 37 ఏళ్ల ఈ భామ.. 34 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు మాత్రం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘తు ఝూదీ మే మక్కార్’ సినిమాకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు రాహుల్ మోడీ. ఆ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ చేశారు శ్రద్ధ. ఈ సినిమా తర్వాత నుంచి శ్రద్ధ, మోడీ డేటింగ్లో ఉన్నారన్న వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వాటిపై ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేశారు శ్రద్ధ. రాహుల్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు శ్రద్ధా కపూర్.
ఆ ఫొటోలో అతని చెయ్యి పట్టుకుని నవ్వుతూ కనిపించారు కూడా! అంతేకాదు, ఆ ఫొటోకు ‘నా మనసును తీసుకుని వెళ్లు. కానీ, నా నిద్రను మాత్రం నాకు తిరిగి ఇచ్చెయ్’ అనే కాప్షన్ పెట్టారు. హార్ట్ సింబల్తోపాటు నవ్వుతున్న ఎమోజీలనూ జతచేశారు. ఈ ఒక్క పోస్ట్‌తో.. తాను రాహుల్‌తో డేటింగ్లో ఉన్నట్టు శ్రద్ధ క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు నెటిజన్లు. జామ్‌నగర్‌లో అత్యంత వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా శ్రద్ధ, రాహుల్ జంటగా కనిపించడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

