Shraddha Kapoor | మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ క్రేజీ డాన్స్.. వీడియో తీసిన బాయ్‌ఫ్రెండ్!
Don’t Stop ’til You Get Enough | బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫన్నీ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Shraddha Kapoor | బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫన్నీ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ సాంగ్ ‘డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్’ (Don’t Stop ’til You Get Enough) అనే పాటకు శ్రద్ధా తన ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకుని, ఎవ్వరినీ పట్టించుకోకుండా ఎంతో హుషారుగా స్టెప్పులేశారు. అయితే ఈ వీడియోను రికార్డ్ చేసింది ఆమె ప్రియుడు రాహుల్ మోడీ అని తెలుస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన శ్రద్ధా.. “మిమ్మల్ని ఇలా డాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి” అంటూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను పెట్టారు.
శ్రద్ధా కపూర్, సినీ రచయిత రాహుల్ మోడీ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి డిన్నర్ డేట్లకు వెళ్లినప్పుడు పలుమార్లు కెమెరాలకు చిక్కారు. గతంలో వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ, డిసెంబర్ 2024లో రాహుల్‌తో కలిసి వడా పావ్ తింటున్న ఫోటోను శ్రద్ధా షేర్ చేసి ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఇప్పటివరకు వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, తరచూ కలిసి కనిపిస్తూనే ఉన్నారు.
శ్రద్ధా కపూర్ చివరిగా 2024 లో వచ్చిన ‘స్త్రీ 2’ (Stree 2) చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘తుంబాడ్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రానున్న ‘పహాడ్పంగిరా’ (Pahadpangira) లో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ నేచురల్ డ్రామా ‘నాగిన్’ తో పాటు, మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ‘ఈత’ (Eetha) అనే బయోపిక్‌లో కూడా ఆమె నటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

