కొత్త ప్రయాణం ఆరంభం

‘దొరసాని’ చిత్రంలో సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది రాజశేఖర్ తనయ శివాత్మిక. తొలి సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న ఆమె తెలుగుతో పాటు తమిళ చిత్రసీమపై దృష్టిపెడుతోంది. గౌతమ్‌కార్తిక్ హీరోగా నటిస్తున్న ‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమా ద్వారా ఈ ఏడాది కోలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నది శివాత్మిక. మొదటి సినిమా విడుదలకాకముందే తమిళంలో మరో చిత్రాన్ని అంగీకరించింది. అశోక్ సెల్వన్ హీరోగా ఆర్ కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించనున్నది. ఆమెతో పాటు రీతూవర్మ, అపర్ణబాలమురళి ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. రోడ్‌జర్నీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలో శివాత్మిక కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. ప్రతిభావంతులైన టీమ్‌తో కలిసి పనిచేసే సమయం కోసం ఉత్సుకతగా ఎదురుచూస్తున్నా’ అని శివాత్మిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది. ఈ సినిమాలో ఇద్దరు తెలుగు హీరోయిన్లు నటించనుండటం గమనార్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

