Shiva Rajkumar | తొలిసారి క్యాన్సర్‌పై ఓపెన్ అయిన శివరాజ్ కుమార్..నా ప్రజలని మోసం చేయలేనంటూ కామెంట్
Shiva Rajkumar | కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితమే. పలు తెలుగు సినిమాలలో నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పెద్ది అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Shiva Rajkumar | కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితమే. పలు తెలుగు సినిమాలలో నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పెద్ది అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా కన్నడ చక్రవర్తి, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. అయితే ఆపరేషన్ ఆనంతరం శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అతడి భార్య గీత శివరాజ్ కుమార్ జనవరి 1న వెల్లడించింది.
మార్చి నుండి ఆయన తిరిగి సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఆయన `45` అనే మూవీ చిత్రీకరణలో పాల్గొని షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఉపేంద్రతోపాటు శివరాజ్ కుమార్ నటించగా, ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ క్యాన్సర్‌పై పోరాటం గురించి ఓపెన్ అయ్యారు. తనకు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, ట్రీట్మెంట్కి వెళ్లాలనుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటనే ప్రశ్న శివరాజ్ కుమార్‌కి ఎదురు కాగా, ఆ సమయంలో తన మైండ్‌లో ఉన్నవి మూడే అంశాలు.. ఫ్యామిలీ రెస్పాన్సిబులిటీ, కమిట్మెంట్స్, భవిష్యత్‌లో ఏం జరగబోతుందనేది అనేది నా మైండ్‌లో తిరుగుతూ ఉండేది.
డాక్టర్లని కలిసినప్పుడు భయపడాల్సిన పనిలేదని ధైర్యం అందించారు. కానీ ఎక్కడో ఒక ఫీయర్ ఉండింది. ట్రీట్మెంట్కి వెళ్లే ముందే నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్ లు కంప్లీట్ చేస్తానని చెప్పాను. వాళ్లు కూడా మీకు టైమ్ లేదు, ట్రీట్మెంట్కి వెళ్లాలని తెలిపారు. ట్రీట్మెంట్కి ముందు బాలకృష్ణ 50ఏళ్ల సెలబ్రేషన్‌లోనూ పాల్గొన్నాను. ఆ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్లాను. కీమో థెరఫీ జరిగిన నాలుగు, ఐదు రోజులకే మళ్లీ తిరిగి వచ్చి షూటింగ్లో పాల్గొన్నాను. అప్పుడు ఈ విషయం చెబితే డైరెక్టర్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను సినిమా పూర్తి చేస్తానంటే రవి వర్మ మీరు ఇది చేయోద్దు, ఏదో మేనేజ్ చేద్దామని అన్నారు కానీ నేను చేస్తానని చెప్పాను, ఎందుకంటే నా ప్రజలను మోసం చేయదలుచుకోలేదు. ఛీటింగ్ చేయడం మంచిది కాదు, షూటింగ్లో పాల్గొనే కరేజ్ నాకు ఉంది, నేను చేయగలను అని చెప్పి అన్నట్టుగానే ఉపేంద్ర, నా టీమ్ ఇలా అందరు సపోర్ట్ తో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాను అని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

