Vedha Movie | ఉత్కంఠ భరితంగా వేద తెలుగు ట్రైలర్.. కాంతార రేంజ్లో ఆకట్టుకుంటుందా?
'కేజీఎఫ్'తో కన్నడ సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఒకప్పుడు కన్నడ సినిమాలంటే చులకనగా చూసే ప్రేక్షకులే ఇప్పుడు కన్నడ సినిమాలను వెతికి మరీ ఓటీటీలో చూస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినిమాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి.
Shivaraj kumar’s Vedha Movie Trailer | ‘కేజీఎఫ్’తో కన్నడ సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఒకప్పుడు కన్నడ సినిమాలంటే చులకనగా చూసే ప్రేక్షకులే ఇప్పుడు కన్నడ సినిమాలను వెతికి మరీ ఓటీటీలో చూస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినిమాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతున్నారు. కాగా గతేడాది కన్నడ సినిమాలు అన్నీ భాషల సినిమాలను డామినేట్ చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ‘చార్లీ777’, ‘విక్రాంత్ రోణ’,’ కాంతార’ ఇలా ప్రతీ రెండు నెలలకు ఓ సినిమా రిలీజవుతూ ఇండియన్ బాక్సాఫీస్‌పై సంచలన విజయం సాధించాయి. కాగా తాజాగా మరో కన్నడ సినిమా తెలుగు రిలీజ్‌కు సిద్ధమైంది.
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘వేద’. ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి డిమాండ్ ఏర్పడటంతో ఫిబ్రవరి 9న వేద సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం సినిమాపై మంచి బజ్ పెంచేందుకు ఊరమాస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ బిగెనింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ యాక్షన్ సీన్స్‌తో నిండి ఉంది. చిన్న పాప, ఓ మహిళ కూడా కత్తి పట్టుకుని దాడి చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ట్రైలర్‌ను గమనిస్తే శివరాజ్‌కుమార్, అతని భార్య, కూతురు కలిసి చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన్నట్లు తెలుస్తుంది. మరి వారి పోరాటం ఎవరి కోసం? దేని కోసం? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అర్జున్ జన్యా నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తుంది. స్వామీ జీ.గౌడ కెమెరా పనితనం మెచ్చుకునేలా ఉంది. కలర్ గ్రేడింగ్ సినిమాకు హైలేట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి శివరాజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రూపొందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

