Extra Ordinary Man | టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. నితిన్ టీం ఇటీవలే రెండో సింగిల్ బ్రష్ వేసుకో పాటను లాంఛ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ చాలా కాలం తర్వాత నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నాడని తెలిసిందే.
పీఎస్వీ గరుడ వేగ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న రాజశేఖర్ (Rajasekhar) ఆ తర్వాత హీరోగా వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆడలేకపోయాయి. దీంతో యూటర్న్ తీసుకోవడంపై రాజశేఖర్ కూతురు శివాని క్లారిటీ ఇచ్చింది. ఈ భామ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం కోట బొమ్మాళి PS. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాని రాజశేఖర్ మాట్లాడుతూ..
తన ఫాదర్ నెగెటివ్ రోల్ చేసేందుకు ఎందుకు రెడీ అయ్యాడో చెప్పింది. నాన్న ఎప్పుడూ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిలా నెగెటివ్ రోల్స్ చేయాలనుకుంటారు. ఆయనకు గతంలో చాలా స్రిఫ్టులు వచ్చాయి. కానీ ఏది కూడా ఆయనకు ఎక్జయిటింగ్‌గా అనిపించలేదు. కానీ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్‌లో ఎక్జయిటింగ్ రోల్ దొరకడంతో వెంటనే ఒకే చెప్పేశారు. ఈ పాత్ర ప్రేక్షకులను ఇంప్రెషన్ కొట్టేయడం ఖాయమని చెప్పుకొచ్చింది.
ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఇటీవలే లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్లో VNRTrio కూడా చేస్తున్నాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన టీజర్లో నితిన్ క్లాస్, స్టైలిష్, మాస్ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు.
అరే నువ్వొక జూనియర్ ఆర్టిస్ట్‌వి.. అంటే ఎక్స్ట్రాగాడివి.. ఒక ఆర్డినరీగాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. అంటూ టీజర్లో కొడుకు క్యారెక్టరైజేషన్ గురించి రావు రమేశ్ సంభాషణలు ఆకట్టుకుంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
బ్రష్ వేసుకో సాంగ్..
సాంగ్ లాంఛ్ ఈవెంట్ విజువల్స్..
@actor_nithiin Dance at CMR College #BrushVesko Song Launch Event from #ExtraOrdinaryMan 🤩💥#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies #RajKumarAkella @vamsikaka… pic.twitter.com/96RR1Eb7ir
— Trend NITHIIN (@TrendNITHIlN) November 10, 2023
The super energetic @actor_nithiin shook his legs to the mass beat of #PeddaPuli 🐯 at the #BrushVesko Song Launch Event for #ExtraOrdinaryMan 🔥@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies… pic.twitter.com/mhYtC4kSFW
— Shloka Entertainments (@ShlokaEnts) November 10, 2023
@actor_nithiin bhaiya 😍 #ExtraOrdinaryMan #BrushVesko pic.twitter.com/om0btpXMWf
— Srinivas (@srinivaschembe5) November 10, 2023
బ్రష్ వేసుకో సాంగ్ నయా లుక్..
The energetic #BrushVesko from #ExtraOrdinaryMan is dropping tomorrow 🥁#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @Jharrisjayaraj @vamsivakkantham#SudhakarReddy #NikhithaReddy @SreshthMovies #RajKumarAkella @vamsikaka @adityamusic @WallsAndTrends pic.twitter.com/ubDFsiECmW
— Suresh PRO (@SureshPRO_) November 9, 2023
Brace yourself for the #ExtraOrdinaryMan‘s Second Single #BRUSHVESKO on November 10th ❤️🔥#ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/2TGxLbsMB6
— nithiin (@actor_nithiin) November 8, 2023
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్..
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..