HBD Sai Pallavi | తమిళ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ బ్యానర్లపై లోకనాయకుడు కమల్ హాసన్(Kalam Haasan) నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు సాయిపల్లవి జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం. బస్సులో కుర్చోని కాశ్మీర్ అందాలను చూస్తున్నట్లు ఈ పోస్టర్ ఉంది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా, ‘ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్’ సిరీస్‌లో ఓ అధ్యాయంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో శివకార్తికేయన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంతో ప్రజెంట్ చేస్తున్నామని.. దేశభక్తి, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Wishing Sensational Talent @Sai_Pallavi92 a very happy birthday. 🎉🎊
– Team #AMARAN#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #HBDSaiPallavi@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Rajkumar_KP @anbariv @gvprakash @RKFI @SonyPicsIndia @sonypicsfilmsin @turmericmediaTM… pic.twitter.com/0C0ne9P5IM— BA Raju’s Team (@baraju_SuperHit) May 9, 2024