సుడిగాలి సుధీర్ ఉరఫ్ సుధీర్ ఆనంద్ కథానాయకుడిగా రూపొందుతున్న గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘హైలెస్సో’. ప్రసన్నకుమార్ కోట దర్శకుడు. వజ్ర వరాహి పతాకంపై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ ‘లైలం బాబు’ అనే పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం శివాజీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
నల్లటి దుస్తులు, పంచెకట్టుతో రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో సోడా సీసా పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న శివాజీని ఈ పోస్టర్లో చూడొచ్చు. శివాజీ ఇందులో అత్యంత పవర్ఫుల్ అవతార్‌లో కనిపిస్తారని, ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నటాషా సింగ్, నక్ష శరణ్ కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రంలో కన్నడ నటి అక్షర గౌడ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: అనుదీప్ దేవ్.