Ghost Movie | శత్రువులను చీల్చి చెండాడుతున్న శివన్న.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఘోస్ట్ ట్రైలర్..!
Ghost Movie | జైలర్‌లో నరసింహగా శివరాజ్ కుమార్ క్షణాల పాటు కనిపిస్తేనే తెలుగు ప్రేక్షకులు చొక్కాలు చింపుకున్నారు. ఆయన ఎంట్రీకి అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. అలాంటిది ఇప్పుడు ది ఘోస్ట్ అంటూ ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతున్నాడు.
Ghost Movie | జైలర్‌లో నరసింహగా శివరాజ్ కుమార్ క్షణాల పాటు కనిపిస్తేనే తెలుగు ప్రేక్షకులు చొక్కాలు చింపుకున్నారు. ఆయన ఎంట్రీకి అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. అలాంటిది ఇప్పుడు ది ఘోస్ట్ అంటూ ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సాండల్ వుడ్ సహా అన్ని వుడ్‌ల నుంచి ఊహించని రెస్పాన్స్ తెచ్చుకుంది. శివన్నను ఆ రేంజ్ మాస్లో చూసి మన ఆడియెన్స్ సైతం సినిమా గురించి అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివన్న ఊరమాస్‌గా కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్‌తో సినిమాపై ఓ చిన్న క్లారిటీ వచ్చేసింది. సామ్రాజ్యాలు సృష్టించే వాడిని చరిత్ర మర్చిపోతుందేమో కానీ.. విధ్వంసం సృష్టించిన వాడిని ఎప్పుడూ మర్చిపోదంటూ ఒక్క డైలాగ్‌తోనే సినిమా థీమ్ ఏంటో మేకర్స్ చెప్పాశారు. సాత్వికంగా ఉండే శివన్న కొన్ని కారణాల వల్ల వైలెంట్ మ్యాన్‌గా మారి శత్రువులను చీల్చీ చెండాడుతూ ఉంటాడు. ఇంతకీ శివన్న విధ్వంసం వెనుక కారణాలేంటి? ఆయన మోటీవ్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. ట్రైలర్ మొత్తం యాక్షన్ పార్ట్‌తో నిండిపోయింది. బీ, సీ సెంటర్లకు వచ్చే ఆడియెన్స్ ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

