Shiva Rajkumar | సినిమా ప్రమోషన్స్.. శివరాజ్ కుమార్‌కి తృటిలో తప్పిన ప్రమాదం!
Bail Movie | కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఆయన నటించిన కొత్త చిత్రం 'బెయిల్' ప్రమోషన్స్‌లో భాగంగా బసవేశ్వర థియేటర్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
Bail Movie | కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఆయన నటించిన కొత్త చిత్రం ‘బెయిల్’ ప్రమోషన్స్‌లో భాగంగా బసవేశ్వర థియేటర్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
థియేటర్లోకి ప్రవేశిస్తున్న సమయంలో అభిమానులు కాల్చిన టపాకాయ ఒకటి ఆయనకు అత్యంత సమీపంలో పేలడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఊహించని పరిణామానికి భయపడిన శివరాజ్ కుమార్ వెంటనే తన ముఖాన్ని, తలను చేతులతో కవర్ చేసుకున్నారు. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను రక్షించారు. కొద్దిసేపు ఆందోళనకర వాతావరణం నెలకొన్నప్పటికీ, ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయన తేరుకుని ప్రశాంతంగా అభిమానులను పలకరించారు, థియేటర్ సిబ్బందితో మాట్లాడారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వేదిక వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల నిర్వాహకులపై మండిపడ్డారు. గతేడాది క్యాన్సర్ చికిత్స నుంచి కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్న శివరాజ్ కుమార్, ప్రస్తుతం ‘బెయిల్’ చిత్రంతో పాటు తమిళంలో ‘జైలర్ 2’ వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
actor shivarajkumar escape Firecracker accident at chitradurga #shivarajkumar #jailer2 #bail #chitradurga #shivanna #chitradurga #KarnatakaNews pic.twitter.com/qxX4kiZ39Q
— Santosh Kumar (@Santhuka820) October 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

