Shiva karthikeyan | ఇకపై అలాంటి సినిమాలు చేయనంటున్న కోలీవుడ్ స్టార్ హీరో
Shiva karthikeyan | కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’(Ayalaan). (తమిళంలో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం). సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రానుండగా.. ఆర్.రవికుమార్ (R. Ravi Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Shiva karthikeyan | కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’ (Ayalaan). (తమిళంలో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం). సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రానుండగా.. ఆర్.రవికుమార్ (R. Ravi Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు శివ కార్తికేయన్. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అయితే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇకపై ఏ సర్టిఫికెట్ సినిమాలు చేయలనుకోవడం లేదని.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసే కథలను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు శివ కార్తికేయన్ వెల్లడించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక వేదికల్లో వైరల్ అవుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) కథనాయికగా నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. పొంగళ్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయలాన్‌లో శివకార్తికేయన్, రకుల్‌తో పాటు ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

