Shiva Jyothi | బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి ఇంట సంబరాలు.. కూతురికి అందమైన పేరు.. వైరల్ అవుతున్న నామకరణ వేడుక ఫొటోలు
Shiva Jyothi | ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి తన జీవితంలో మధురమైన మాతృత్వ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఫిబ్రవరిలో జన్మించిన తన గారాల పట్టికి తాజాగా ఘనంగా నామకరణ వేడుక నిర్వహించి ‘వెన్నెల’ అని పేరు పెట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Shiva Jyothi | ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి తన జీవితంలో మధురమైన మాతృత్వ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఫిబ్రవరిలో జన్మించిన తన గారాల పట్టికి తాజాగా ఘనంగా నామకరణ వేడుక నిర్వహించి ‘వెన్నెల’ అని పేరు పెట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివజ్యోతి బుల్లితెరపై తన మాటతీరు, భావోద్వేగాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు తల్లిగా కొత్త బాధ్యతలను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి, అప్పటి నుంచి తన మాతృత్వ అనుభూతులను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వస్తున్నారు.
తాజాగా తమ చిన్నారి కోసం ఘనంగా నామకరణ వేడుకను నిర్వహించిన శివజ్యోతి దంపతులు, ఆ బుజ్జాయి పాపకు ‘వెన్నెల’ అని అందమైన పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఆమె.. “మా వెన్నెల చుట్టాలు” అంటూ భావోద్వేగంగా పోస్టు చేశారు. తమ ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిన చిన్నారికి ఈ పేరు పెట్టడం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.ఈ నామకరణ వేడుకను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన వేదికపై శివజ్యోతి, ఆమె భర్త గంగులు దంపతులు తమ చిన్నారి వెన్నెలతో కలిసి ఎంతో ఆనందంగా కనిపించారు. పాపను చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. చిన్నారిని ఆశీర్వదిస్తూ శివజ్యోతి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో సంప్రదాయం, కుటుంబ అనుబంధాలు, ఆనంద క్షణాలు అన్నీ కలిసిపోయి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాయి.ప్రస్తుతం ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు “వెన్నెల అనే పేరు చాలా అందంగా ఉంది”, “పాప చాలా క్యూట్‌గా ఉంది”, “మీ కుటుంబానికి శుభాకాంక్షలు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన కూతురు నామకరణ వేడుకతో మరోసారి వార్తల్లో నిలిచిన శివజ్యోతి.. “ఈ ఏడాది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే స్పెషల్ ఇయర్” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

