న్యూఢిల్లీ: షెర్లిన్ చోప్రా.. సాంటా డ్రెస్సులో చిందేసింది. తన ఇన్స్టాగ్రామ్లో ఆమె ఆ వీడియోను పోస్టు చేసింది. క్రిస్మస్ సందర్భంగా మోడల్ షెర్లిన్ ఈ వీడియోను షేర్ చేసింది. రెడ్ స్కర్ట్, క్రాప్ టాప్ వేసుకున్న షెర్లిన్.. సెక్సీ సాంటాగా మారింది. షెర్లిన్ షేర్ చేసిన క్రిస్మస్ వీడియోపై నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. క్రైస్తవ మతాన్ని అవహేళన చేస్తున్నారని ఓ యూజర్ రాశాడు. బేషరమ్ అంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. కానీ ఈ వీడియోకు లైక్లు తెగ వచ్చేస్తున్నాయి.