Kuberaa OTT | ఓటీటీలోకి శేఖర్ కమ్ముల ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Kuberaa On Prime | విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కుబేర ఓటీటీలోకి రాబోతుంది.
Kuberaa On Prime | విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కుబేర (Kuberaa on Prime) ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది చిత్రబృందం. తమిళ నటుడు ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించాడు. గత నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడంతో పాటు టాలీవుడ్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్‌ని అందించింది. దాదాపు రూ.150 కోట్లకి పైగా వసుళ్లను రాబట్టిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది. ప్రమఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జూలై 18 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
a simple man, and the not so simple journey of his redemption arc ✨#KuberaaOnPrime, July 18@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @jimSarbh @sekharkammula @ThisIsDSP @mynameisraahul @AdityaMusic @KuberaaTheMovie @SVCLLP @amigoscreation pic.twitter.com/lVCjhi6YO4
— prime video IN (@PrimeVideoIN) July 11, 2025
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్(జిమ్ సర్ఫ్) కన్ను పడుతుంది. ప్రభుత్వాన్ని కొని అయినా సరే.. ఆ అయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలని ప్రయాత్నాలు మొదలుపెడతాడు నీరజ్. ప్రభుత్వ పెద్దలను లక్ష కోట్లు ఎర వేయడంతో.. వాళ్లు నీరజ్‌కు సముద్రాన్ని రాసిస్తారు. ఆ లక్షకోట్ల నల్ల ధనం ప్రభుత్వ పెద్దలకు చేరాలంటే ముందు అది వైట్ మనీగా మారాలి. అలా మార్చగల ఒకేఒక్క వ్యక్తి సీబీఐ ఆఫీసర్ దీపక్(అక్కినేని నాగార్జున). కొందరి కుట్రల వల్ల అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దీపక్‌ను ఈ విషయంలో సాయం కోరతాడు నీరజ్. జైలు నుంచి విడిపించడమే కాక, కావాల్సినంత డబ్బు కూడా ఇస్తామనడంతో.. స్వతహాగా నిజాయితీ పరుడైన దీపక్.. కుటుంబం కోసం నీరజ్‌తో తప్పక చేయి కలుపుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు బినామీ ఖాతాలలో లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. దాని కోసం నలుగురు బెగ్గర్లను సెలక్ట్ చేస్తారు. వారిలో దేవ(ధనుష్) ఒకడు. మరి దీపక్ ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు ఈ కథలో దేవా పాత్ర ఏంటి? దేవాకూ, దీపక్కూ మధ్య సంబంధం ఏంటి? పారిశ్రామిక వేత్త నీరజ్ ప్రయత్నం సఫలమైందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

