Home
Cinema
She Continues To Prove Her Mettle With Dhurandhar 2 As Well In This Context Her Father Raj Arjun Has Heaped Lavish Praise Upon Sara Arjun
పుత్రికోత్సాహం
సారా అర్జున్.. బాలీవుడ్లో లేటెస్ట్ సెన్సేషన్! హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం (ధురంధర్)తోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ధురంధర్-2తోనూ సత్తా చాటుతున్నది. ఈ క్రమంలో సారా అర్జున్ను ఆకాశానికి ఎత్తేశాడు ఆమె తండ్రి, నటుడు రాజ్ అర్జున్.
సారా అర్జున్.. బాలీవుడ్లో లేటెస్ట్ సెన్సేషన్! హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం (ధురంధర్)తోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ధురంధర్-2తోనూ సత్తా చాటుతున్నది. ఈ క్రమంలో సారా అర్జున్ను ఆకాశానికి ఎత్తేశాడు ఆమె తండ్రి, నటుడు రాజ్ అర్జున్. తన బిడ్డ వల్లే తన జీవితం మారిందనీ, ఆమే తన జీవితాన్ని కాపాడిన ‘ధురంధర్’ అంటూ చెప్పుకొచ్చాడు. ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రాజ్ అర్జున్.. ఒక తండ్రిగా తన జీవిత ప్రయాణాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన కుమార్తె సారా అర్జున్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అవకాశాల కోసం ముంబైలో ఆకలితో అలమటించిన తనకు.. తన బిడ్డ ఎలా అండగా నిలిచిందో వివరించాడు.
“ఎన్నో కలలతో ముంబైలో అడుగుపెట్టాను. కానీ, ఎక్కడికి వెళ్లినా తిరస్కరణలే ఎదురయ్యాయి. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సరిగ్గా అలాటి సమయంలోనే.. 2005లో నా బిడ్డ సారా పుట్టింది. ఆడపిల్ల పుట్టడం అదృష్టమని ఎక్కడో విన్నాను. నా విషయంలో అది అక్షరాలా నిజమైంది” అంటూ రాజ్ అర్జున్ చెప్పుకొచ్చాడు. సారా పుట్టిన వెంటనే తనకు మొదటిసారి లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చిందట. అయితే, అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోయినా.. తనలో మాత్రం పట్టుదల తగ్గలేదని అన్నాడు రాజ్. ఇక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. “ఖాళీ జేబులతో అద్దం ముందు నిలబడటానికి కూడా భయపడేవాణ్ని. నా కూతురి మెరిసే కళ్లు మాత్రం.. ‘నాన్నా! ధైర్యంగా ఉండు. నాకు నువ్వు కావాలి’ అని చెబుతున్నట్లుగా ఉండేవి.
తనే నా ధురంధర్. ఓ విజేతలాగా నన్ను పడిపోకుండా కాపాడింది. సాధారణంగా ఒక బిడ్డ తండ్రి చేయి పట్టుకుని నడుస్తుంది. కానీ, నా విషయంలో మాత్రం.. నా కూతురి చేయి పట్టుకునే నేను గమ్యాన్ని చేరుకున్నా!” అని చెప్పుకొచ్చాడు. పుత్రికోత్సాహంతో అందరి మనసు కదిలించేలా తన బిడ్డ గురించి రాజ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రాజ్ అర్జున్.. 2004లో ‘బ్లాక్ ఫ్రైడే’ సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టాడు.
రౌడీ రాథోడ్, రాయీస్, షేర్షా, ఆర్టికల్ 370 వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. రజాకార్, డియర్ కామ్రేడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించాడు. ఇక తన బిడ్డ సారా అర్జున్ గురించి తెలిసిన ముచ్చటే! ఆరేళ్లకే ‘దైవ తిరుమగళ్’ (నాన్న) చిత్రంలో అద్భుతమైన అభినయం చూపింది. అదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

