Oke Oka Jeevitham Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్
Oke Oka Jeevitham Movie Trailer | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్‌ను సాధించలేకపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ భారీ అంచనాలతో విడుదలై శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈయన ఒక్క హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇక లేటెస్ట్గా ఈయన నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకార్తిక్ దర్శకత్వం ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
శర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేషన్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైలర్ ప్రారంభమవుతుంది. అంతలోనే రీతూవర్మ ‘కంగ్రాట్స్ ఆది.. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యావ్’ అంటూ శర్వాతో పలికిన సంభాషణ ఆకట్టుకుంటుంది. అయితే కాంపిటేషన్‌లో శర్వా పాడలేక ఇబ్బంది పడుతుంటాడు. అసలు ఎందుకు ఇబ్బందిపడుతున్నాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మ్యారేజ్ బ్రోకర్‌గా వెన్నెల కిషోర్ ట్రైలర్లో కనింపించాడు. ఇక ప్రియదర్శి తను ఎలాగైన ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంటాడు. ‘ఏదేమైనా పెళ్ళి కరెక్ట్ టైంలోనే జరగాలిరా’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్‌తో నాజర్ ఎంట్రీ ఇస్తాడు. నాజర్ ఈ చిత్రంలో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషన్‌తో నాజర్ ఈ ముగ్గురుని వాళ్ళ బాల్యంలోకి పంపిస్తాడు. అసలు వీళ్ళ పాస్ట్‌లో ఏం జరిగింది? మళ్ళీ వీళ్ళు గతంలోకి ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ తన తల్లిని కలుసుకొవడం కోసం వెనక్కు వెళ్ళినట్లు, ప్రియదర్శి తనను రిజెక్ట్ చేసిన అమ్మాయిలను కలుసుకోవడం కోసం గతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంలో శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటించింది. శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశారు. ద్వి భాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదలవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

