ఒకటే కదా జీవితం..
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తీక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న 30వ చిత్రమిది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘ఒకటే కదా..’అనే పాట లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. కథానాయకుడి జీవితంలోని సంఘర్షణ, ప్రేమకోసం అతను పడే తపనను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు జేక్స్ బిజోయ్ స్వరాల్ని సమకూర్చారు. గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ‘ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ సారంగ్, సంభాషణలు: తరుణ్‌భాస్కర్, రచన-దర్శకత్వం: శ్రీకార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

