Sharwanand Oke Oka Jeevintham Release date | యువ హీరో శర్వానంద్‌ను కొన్నేళ్ళుగా వరుసగా ఫ్లాప్‌లు వెంటబడుతున్నాయి. ఇటీవలే భారీ అంచనాల నుడమ విడుదలైన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిజానికి ఈయన నటించిన గత ఆరు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. దీంతో శర్వా తన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చే ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఓకే ఒక జీవితం’ చిత్రంపైనా ఉన్నాయి. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్న ఈ సినిమా రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపారు. గతంలో విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. అ చిత్రంలో అక్కినేని అమల కీలకపాత్రలో నటిస్తుంది. శర్వాకు జోడీగా రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన అమ్మ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.