Sharwanand | పిల్లల్ని పెంచడం యూట్యూబ్ చూసినంత ఈజీ కాదు.. శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ రిలీజ్
Sharwanand | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే(Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో పాటు టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Sharwanand | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే(Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో పాటు టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
కథను రివీల్ చేయకుండా ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియకుండా ఉంది. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

