ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు..
‘మంచి ప్రొడక్ట్ చేశామని తెలుసు. అయితే ఇంత స్పందన ఊహించలేదు. విక్రమ్‌కుమార్ కథ చెబుతున్నప్పుడే ఆ ప్రపంచంలో మనల్ని హోల్డ్ చేస్తారు. అయితే ఈ కథను ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఎలా మలుస్తారనే క్యూరియాసిటీ ఉండేది.
‘మంచి ప్రొడక్ట్ చేశామని తెలుసు. అయితే ఇంత స్పందన ఊహించలేదు. విక్రమ్‌కుమార్ కథ చెబుతున్నప్పుడే ఆ ప్రపంచంలో మనల్ని హోల్డ్ చేస్తారు. అయితే ఈ కథను ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఎలా మలుస్తారనే క్యూరియాసిటీ ఉండేది. కొన్ని నెలల తర్వాత ఎపిసోడ్స్ వారీగా చెప్పారు. థ్రిల్ ఫీలయ్యాం. ఇప్పుడు ఆడియన్స్ కూడా అదే థ్రిల్ ఫీలవుతున్నారు.’ అని నిర్మాత శరత్‌మరార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా ఆయన నిర్మించిన వెబ్‌సిరీస్ ‘దూత’. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు.
ప్రియాభవానీశంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రధారులు. ఈ నెల 1నుంచి ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విజయవంతంగా ప్రసారం అవుతున్నది. ఈ సందర్భంగా శరత్‌మరార్ విలేకరులతో మాట్లాడారు. ‘నాగచైతన్య చేయడానికి ముందుకు రాకపోతే ఈ సిరీస్ లేదు. ఆయన కెరీర్లోనే బెస్ట్ అనిపించేలా ఇందులో నటించారు. ఆ మాటకొస్తే ఇందులోని ప్రతి ఒక్కరూ గొప్పగా నటించారు’ అన్నారు శరత్‌మరార్.
తనను పవన్‌కల్యాణ్ సినీనిర్మాతను చేశారని, భవిష్యత్ అంతా వెబ్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టే, త్వరగా వెళితే అందులోని గ్రామర్ అర్థమవుతుందని వెబ్‌సిరీస్ చేయడం మొదలుపెట్టానని, గతంలో ఎన్ని చేసినా, ‘దూత’ ఇచ్చి విజయం మాత్రం మెమరబుల్ అని శరత్‌మరార్ ఆనందం వెలిబుచ్చారు. ‘240 దేశాల్లో ఈ సిరీస్ విడుదల చేయడమే కాక, 38 భాషల్లో సబ్‌టైటిల్స్ చేశారు. పనిచేసిన ఆర్టిస్టులందరూ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా ‘దూత’లోని ఒక ఎపిసోడ్ ప్రదర్శించాం. ఇలా ఆర్థికంగానేకాక, మానసికంగా కూడా సంతృప్తిన్చింది ‘దూత’ ’ అని చెప్పారు శరత్‌మరార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

