Sharon Stone: ఆ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పిన షారన్ స్టోన్
Sharon Stone: హీరోతో శృంగారం చేస్తే .. ఫిల్మ్ షూటింగ్ సమయంలో .. ఆ హీరోతో సీన్ మరింత రసవత్తరంగా ఉంటుందని ఓ ప్రొడ్యూసర్ తనను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్లు నటి షారన్ స్టోన్ గతంలో పేర్కొన్నది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హాలీవుడ్ ప్రొడ్యూసర్ పేరును కూడా చెప్పిందామె.
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ తార షారన్ స్టోన్(Sharon Stone) ఒకప్పుడు ఫేమస్. ఆమె నటించిన బేసిక్ ఇన్‌స్టింక్ ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీలో ఉన్న శృంగార సన్నివేశాలు అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఓ ప్రొడ్యూసర్ తనను వేధించిన విషయాన్ని ఆమె గతంలో ఓ సారి గుర్తి చేసింది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎవరన్న విషయాన్ని ఆమె చెప్పేసింది. ఓ చిత్రంలో తనతో పాటు నటిస్తున్న బిల్లీ బాల్డ్విన్తో శృంగారంలో పాల్గొనాలని ప్రొడ్యూసర్ రాబర్ట్ ఈవెన్స్ తనను బలవంత పెట్టినట్లు షారన్ గుర్తు చేశారు. స్పాటిఫ్స్ లూయిస్ థిరాక్స్ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
గాఢ్‌ఫాదర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఓసారి తనను ఆఫీసుకు రమ్మనాన్నడని, షూటింగ్ మధ్యలో ఆ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.. బిల్లీ బాల్డ్విన్తో చనువుగా ఉంటే, సినీ సన్నివేశాలు మరింత రసవత్తరంగా వస్తాయని చెప్పినట్లు షారన్ పేర్కొన్నది. 1993లో రిలీజైన థ్రిల్లర్ సినిమా షూట్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నటుడు బిల్లీ బాల్డ్వన్తో శృంగారంలో పాల్గొనాలని, ఎందుకంటే అప్పుడు హీరోతో నటిస్తున్న సమయంలో సీన్‌ను పండించవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆ ప్రొడ్యూసర్ వ్యక్తం చేసినట్లు షారన్ తెలిపింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండాలంటే, బిల్లీతో శృంగారం చేయాలని ఆ ప్రొడ్యూసర్ ప్రలోబ పెట్టినట్లు ఆమె చెప్పింది.
నటి షారన్ స్టోన్ చేసిన ఆరోపణలకు నటుడు బిల్లీ బాల్డ్విన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో భారీ పోస్టు చేశారు. షారన్ స్టోన్పై తానో పుస్తకాన్ని రాయనున్నట్లు చెప్పాడు. అందులో ఆమె చేసిన పనులన్నీ చెప్పనున్నట్లు ఆ నటుడు పేర్కొన్నాడు. షారన్‌కు తన మీద ఇంకా క్రష్ ఉన్నట్లు అతను తెలిపాడు. షారన్‌తో సన్నితంగా ఉన్న ఓ ఫిల్మ్ ఫోటోను అతను షేర్ చేశాడు.
Not sure why Sharon Stone keep talking about me all these years later?
Does she still have a crush on me or is she still hurt after all these years because I shunned her advances?
Did she say to her gal pal Janice Dickinson the day after I screen tested and ran into them on our… pic.twitter.com/PtgqMC6Sgz
— Billy Baldwin (@BillyBaldwin) March 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

