శరణ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాక్షి’. శివ కేశన కుర్తి దర్శకుడు. సుధాకర్ రెడ్డి నిర్మాత. ఇటీవల దివంగత సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘తాజాగా విడుదల చేసిన టీజర్లో ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్‌ను చూపించాం.
గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త హీరో శరణ్‌కుమార్ ఫైట్ సీన్స్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచాడు. హీరోగా ఈ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు నిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.