మంగళవారం రోజు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో భాగంగా పలువురు ఇంటిసభ్యులు వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కొట్టేశారు. ఇందుకోసం కెప్టెన్ శ్రీరామ్.. ప్రియ, షణ్ముఖ్, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు. షణ్ముఖ్‌కి తనకిమధ్య పెద్ద గొడవ జరిగినప్పటికీ దాన్ని మనసులో పెట్టుకోకుండా ఉదయాన్నే బిగ్ బాస్ ఇచ్చిన అమెజాన్ ప్రైజ్ కూపన్ టాస్క్‌లో షణ్ముఖ్‌ని ఎంపిక చేసి.. అతనికి లాప్ టాప్ ప్రైజ్‌గా వచ్చేట్టు చేశాడు శ్రీరామ్.
తన కెరియర్ ఎదుగుదలకు కారణం అయిన దర్శకుడు సుబ్బుకి ఆ ల్యాప్ టాప్‌ని గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు షణ్ముఖ్. ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే అవకాశాన్ని అందుకుంది.మానస్.. తన తల్లికి బ్రాండెడ్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు. హమీదా.. తన తల్లికి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది.
ఇక కాజల్ కాస్త అతి చేస్తున్నట్టు రవికి అనిపిండంతో ఆమెపై మండి పడ్డాడు.నెల రోజుల నుంచి లోబో, రవి వాష్‌రూమ్ క్లీనింగ్ తప్ప కిచెన్ వైపు చూడట్లేదని కాజల్ అనడంతో రవి ఆమెపై ఫైర్ అయ్యాడు. లోబో అయితే ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. దీనిపై కాజల్-లోబో మధ్య చాలా సేపు డిస్కషన్ జరిగింది.