ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌజ్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్ని ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది మధ్య ఆసక్తికర ఫైట్ కూడా నడిచింది. అయితే వరస్ట్ పర్ఫార్మర్ ఎవరని అనుకుంటున్నారో వారిని నెక్ లాక్‌లో వాళ్లని బంధించి వాళ్ల ముఖంపై నీళ్లు చల్లి, అందుకు కారణం వెల్లడించాని బిగ్ బాస్ తెలియచేశారు. ఈ క్రమంలో మొదటిగా కాజల్‌ని శ్వేత.. వరస్ట్ పెర్ఫామర్ అని చెప్తూ ఆమె ముఖంపై నీళ్లు చల్లింది.
జస్వంత్.. శ్రీరామ్‌ని వరస్ట్ పర్ఫార్మర్ అని అన్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్- జస్వంత్ మధ్య డిస్కషన్ చాలా హాట్‌గా నడిచింది.ఇక . షణ్ముఖ్ .. విశ్వని చెత్త పెర్ఫామర్ అని చెప్తూ.. ముఖంపై నీళ్లు చల్లాడు. టాస్క్‌లో చిల్లర, థూ అంటూ మాటలు జారడం నచ్చలేదని షణ్ముఖ్ కారణం చెప్పగా, అదే కారణంతో విశ్వను వరస్ట్ పర్ఫామర్‌గా నామినేట్ చేశారు సిరి, ప్రియ.
ఇక హమీద కాజల్ ముఖంపైన శ్రీరామ్ కూడా కాజల్ ముఖంపైనే నీళ్లు చల్లాడు. వెంటనే కాజల్ కూడా శ్రీరామ్‌ని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్తూ ముఖంపై నీళ్లు కొట్టింది.ఇక నుండి మన ఇద్దరి బ్రదర్,సిస్టర్ కాదు ఏ రిలేషన్ వద్దంటూ కాజల్ చెప్పింది. ఇక ఆనీ మాస్టర్ కూడా కాజల్ ముఖంపై నీళ్లు చల్లింది. ఇక యాంకర్ రవి నమ్మిన బంటు లోబో.. కాజల్‌ని చెత్త పెర్ఫామర్ అని అంటూ.. రవి టీంలో ఉంటూ అతనికే వెన్నుపోటు పొడిచావ్ అందుకే నాకు నచ్చలేదని చెప్పాడు లోబో.