గురువారం ఎపిసోడ్ లో హౌజ్‌మేట్స్ అందరు సినిమా స్టార్స్‌గా మారి సందడి చేస్తుండగా, అబ్బని తియ్యని దెబ్బ సాంగ్ పాటకు మానస్-కాజల్‌లు డాన్స్‌తో ఇరగదీశారు. సన్నీ కూడా జోడు కలిశాడు. మానస్ అయితే స్టెప్లు దింపేశాడు. సూర్య పాటకి షణ్ముఖ్ డ్యాన్స్ చేశాడు. ఆ తరువాత మానస్.. షణ్ముఖ్‌లు స్టెప్పులతో రచ్చ చేశారు. ఆ తరువాత శ్రీరామ్ కోసం.. అన్నయ్య చిరంజీవి ముఠామేస్త్రి సాంగ్ వేశారు.
ఈ టాస్క్ రెండో దశలో భాగంగా.. ఇంటి సభ్యులంతా కలిసి వారి వారి పాత్రలో ఒక టాస్క్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించగా.. సిరి, సన్నీ, కాజల్, మానస్లు మాట్లాడుకుంటూ.. షణ్ముఖ్‌ని స్కిట్ కోసం చర్చించడానికి పిలుస్తారు. ‘నాకు స్కిట్స్ రావు. మీరంతా ఒక బ్యాచ్ బ్రో’ అంటూ షణ్ముఖ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సిరి అతడిని బతిమలాడేందుకు ప్రయత్నించింది. ‘నాతో కూర్చొని ఉంటే మూడ్ ఆఫ్‌లో ఉంటావు.
అందుకనే అక్కడకు వెళ్లు. చాలా సంతోషంగా ఉంటావు అంటూ సిరిపై సెటైర్స్ వేయడం మొదలు పెట్టాడు. ‘నీతో కలవలేకపోతున్నాను. అక్కడ నువ్వు బెటర్ పర్సన్’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.‘ఎందుకు అలా ఫిక్స్ అవుతావ్ అని సిరి అంటే.. నాకు అర్థమౌతుంది.. నువ్ అక్కడే బెటర్‌గా ఉంటావ్.. నాకు నీతో సింక్ కావడం లేదు.. నీకు ప్రతిసారి చెప్పడం నాకు నచ్చడం లేదు..’ అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.