బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన 101వ ఎపిసోడ్లో షణ్ముఖ్ వీడియో ప్లే చేశారు. ఇందులో మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారని చెప్పారు.ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు.. మీకు ఎంత ముఖ్యమో.. మీరు వాళ్ల కోసం నిలబడ్డ తీరు తెలియజేస్తుంది.. వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.. ఎన్ని గొడవలైనా.. చివరి వరకూ ఒకరిగానే ఉన్నారు.
మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు.. మీలోని ప్రేమను ఆ గది చూసింది.. ’ అంటూ చెప్పుకొచ్చారు బిగ్ బాస్. మొత్తంగా షణ్ముఖ్ గురించి బిగ్ బాస్ చెప్పిన దాంట్లో మోజ్ రూం ఒకటి కాగా.. మిగిలినది అంతా సిరి కోసమే అన్నట్టుగా ఉంది. షణ్ముఖ్ స్పెషల్ వీడియోలోనూ.. చాలా వరకూ సిరితో చేసిన రొమాన్స్ హగ్‌ల గోలే ఉంది.
మీ మనసుని తాకిన ఫొటో గ్రాఫ్‌ని మీతో కలిసి తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు షణ్ముఖ్. అదే ఫొటోలో సిరి కూడా ఉండటంతో.. చాలా హ్యపీగా ఫీలైంది. బయట బిగ్ బాస్ ఏమేం చెప్పాడో షణ్ముఖ్.. సిరికి వివరించగా ఆమె ఫుల్ ఖుష్ అయింది.