బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లలో సిరి ఇతర కంటెంస్టెంట్స్ తో కలిసి డ్యాన్స్ చేయడం షణ్ముఖ్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. స్కిట్ చేసే క్రమంలో సిరి.. షణ్ముఖ్‌ని పిలిచిన అతను రాకుండా పంచ్ డైలాగులు విసిరాడు. ఇప్పటివరకూ నాతో ప్రాబ్లమ్ లేదు.. ఈవీక్ మాత్రమే నాతో ప్రాబ్లమ్ ఉంది.. అది ఎందుకో కూడా నాకు అర్థమైంది అని సిరి అంటే.. సీన్ క్రియేట్ చేయకు అంటూ షణ్ముఖ్ చిరాకుపడతాడు.
ఆ తరువాత సిరి పెర్ఫామెన్స్ స్టార్ట్ చేస్తుంది.. నేను స్కిట్ చేయను.. అంటూ సిరి వాష్ రూంలోకి వెళ్లిపోగా.. ఆ వెనుక షణ్ముఖ్వెళ్లి.. తప్పు నాదే.. నేనే ట్రిప్ అయ్యాను.. మనిద్దరికీ బాత్ రూంలో గొడవకి దరిద్రమైన పాస్ట్ ఉంది అని అంటాడు. నువ్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా.. నేను తిరిగి ఒక్క మాట అనడం లేదు.. నీ పరిస్థితిని అర్ధం చేసుకున్నా.. టాస్క్‌ల విషయంలో ఇలా చేయకు.. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. మన ఫ్రెండ్ షిప్కి వాల్యూ ఇస్తా అని సిరి చెప్పుకొస్తుంది.
వాష్ రూం దగ్గర ఇద్దరు హగ్ చేసుకొని మళ్లీ ప్రేక్షకులకి చిరకు తెప్పించారు. నేటి ఎపిసోడ్‌లోను వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగేలా కనిపిస్తుంది. షో మొత్తంలో సగానికి పైగా వీరిద్దరి ముచ్చటే ఉంటుండడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ వారం సిరి, కాజల్‌లలో ఒకరు బయటకు వెళ్లనున్నట్టు ప్రచారం నడుస్తుంది.