అదే పెద్ద బహుమతి
పుట్టినరోజు ఏ హాలీడేకో వెళ్దామనుకుంటారు తారలు. ఆ రోజు పనిచేసేందుకు చాలా మందికి మనసొప్పద్దు. కానీ పుట్టినరోజున కొత్త సినిమా షూటింగ్ పనిలో దిగింది బాలీవుడ్ తార వాణీ కపూర్. బర్త్ డేకు కొత్త సినిమా అవకాశం రావడమే తనకు దక్కిన పెద్ద బహుమతి అని చెబుతున్నదీ నాయిక.
పుట్టినరోజు ఏ హాలీడేకో వెళ్దామనుకుంటారు తారలు. ఆ రోజు పనిచేసేందుకు చాలా మందికి మనసొప్పద్దు. కానీ పుట్టినరోజున కొత్త సినిమా షూటింగ్ పనిలో దిగింది బాలీవుడ్ తార వాణీ కపూర్. బర్త్ డేకు కొత్త సినిమా అవకాశం రావడమే తనకు దక్కిన పెద్ద బహుమతి అని చెబుతున్నదీ నాయిక. ‘బేఫికర్’, ‘వార్’, ‘బెల్‌బాటమ్’ లాంటి చిత్రాలతో అగ్రతారగా పేరు తెచ్చుకుంది వాణీ కపూర్. ఆమె ఇటీవల నటించిన ‘చంఢీగడ్ కరే ఆషికీ’, ‘బదాయి దో’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొంది మంచి పేరు తీసుకొచ్చాయి.
రణ్‌బీర్ కపూర్ సరసన నటించిన ‘షంషేరా’ విజయాన్ని సాధించకున్నా…వాణీ అవకాశాలపై ఏ ప్రభావం లేదు. మంగళవారం వాణీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…‘పుట్టినరోజు కొత్త సినిమా షూటింగ్ చేస్తున్న ఫీల్ బాగుంది. ఇదే పెద్ద గిఫ్ట్ అనుకుంటా. ‘చంఢీగడ్ కరే ఆషికీ’ తర్వాత సినిమాల ఎంపిక పట్ల నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. నేను చేసే ఏ సినిమా అయినా ప్రేక్షకులు మాట్లాడుకునేలా ఉండాలి, ప్రధాన శీర్షికల్లో నిలవాలి. నటిగా పేరు తెచ్చుకునే పాత్రల్లో నటిస్తే నాకూ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Shamshera
- Vaani Kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

