Shamita Shetty | సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల వయస్సు, పెళ్లి, వ్యక్తిగత జీవితాలపై తరచూ నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ నటి షమితా శెట్టి కూడా ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి ఆమె హుందాగా, ఘాటుగా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో షమితా శెట్టిపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. “మీ వయస్సు పెరిగిపోయింది.. ముసలితనం వచ్చేస్తోంది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవచ్చు కదా” అంటూ అతను కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ని చాలామంది సాధారణంగా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ షమితా మాత్రం ఎంతో హుందాగా, అదే సమయంలో గట్టిగానే స్పందించారు.
వయస్సుపై వచ్చిన విమర్శలకు స్పందించిన షమితా శెట్టి.. జీవితంపై తన పాజిటివ్ దృక్పథాన్ని వెల్లడించారు.అవును.. నా వయస్సు పెరుగుతోంది. దాంతో పాటు నాలో మార్పులు కూడా వస్తాయి. కాలంతో పాటు ప్రకృతిలో ప్రతిదీ మారుతుంది. శారీరక రూపురేఖలతో సహా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అంటూ ఆమె పేర్కొన్నారు.అలాగే తాను ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా, మానసికంగా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు. నా వయస్సుకు తగ్గట్లుగా నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. మానసికంగా ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాను. అది నాకు చాలు అంటూ షమితా చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఇక పెళ్లిపై వచ్చిన కామెంట్‌కు షమితా ఇచ్చిన కౌంటర్ మరింత వైరల్ అవుతోంది.పెళ్లి చేసుకుని మీరేం సాధించారు? అంతగా పెళ్లై సెటిల్ అయ్యామని అనుకునే మీరు.. నాలాంటి సింగిల్ వ్యక్తులను సోషల్ మీడియాలో ఎందుకు ఫాలో అవుతున్నారు? మా జీవితాలపై మీకెందుకు అంత ఆసక్తి? అంటూ ట్రోలర్‌ను నేరుగా ప్రశ్నించారు.ఈ సమాధానంతో సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత జీవితాలపై అనవసర కామెంట్లు చేసే వారిపై ఆమె గట్టిగా స్పందించినట్లైంది.షమితా శెట్టి కామెంట్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా మహిళా అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.ఒక మహిళ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం, వయస్సు పెరిగిందని ట్రోల్ చేయడం సరైంది కాదు, షమితా చాలా మెచ్యూర్‌గా సమాధానం ఇచ్చారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.