Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో శుక్రవారం జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒకే ఒక్క నిర్ణయంతో త్రిగుణ్ గేమ్ స్వరూపాన్నే మార్చేశారు. అయితే ఆయన ఆడిన ఆట సొంత టీమ్ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. బ్లూ టీమ్‌లో ఉన్న త్రిగుణ్.. తన టీమ్‌కు కాకుండా గ్రీన్ టీమ్ సభ్యుడు అమన్‌కు మద్దతు ఇవ్వడంతో వివాదం మొదలైంది.
Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో శుక్రవారం జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఒకే ఒక్క నిర్ణయంతో త్రిగుణ్ గేమ్ స్వరూపాన్నే మార్చేశారు. అయితే ఆయన ఆడిన ఆట సొంత టీమ్ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. బ్లూ టీమ్‌లో ఉన్న త్రిగుణ్.. తన టీమ్‌కు కాకుండా గ్రీన్ టీమ్ సభ్యుడు అమన్‌కు మద్దతు ఇవ్వడంతో వివాదం మొదలైంది. దీంతో షాలిని, రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పరిణామం గ్రీన్ టీమ్‌కు భారీ ప్రయోజనం చేకూర్చింది. బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌లో బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, గ్రీన్ టీమ్ నుంచి అమన్, గోల్డ్ టీమ్ నుంచి శివకుమార్ పాల్గొన్నారు. ఈ పోటీలో త్రిగుణ్ తన సొంత టీమ్ తరఫున గెలవడానికి ప్రయత్నించకుండా అమన్‌కు మద్దతుగా నిలిచారు. త్రిగుణ్ సహకారంతో అమన్ గేమ్‌లో విజయం సాధించగా, గ్రీన్ టీమ్‌కు అత్యధిక పాయింట్లు లభించాయి.
అయితే బ్లూ టీమ్ సభ్యులైన షాలిని, రోహిత్ మాత్రం త్రిగుణ్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. సొంత టీమ్‌కు సహకరించాల్సింది పోయి, ప్రత్యర్థి టీమ్ సభ్యుడికి సాయం చేయడమేంటని ప్రశ్నించారు. త్రిగుణ్ ప్రవర్తనను తప్పుబడుతూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసారు. గేమ్ అనంతరం త్రిగుణ్ తన నిర్ణయం వెనుక కారణాన్ని గ్రీన్ టీమ్ సభ్యులకు వివరించారు. తాను గేమ్‌లో గెలిస్తే బ్లూ టీమ్‌కు చెందిన రోహిత్‌కు కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం దక్కుతుందని, రోహిత్ కెప్టెన్ కావడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఇక రోహిత్ కెప్టెన్ కావడం కోసం తాను గేమ్ గెలవాలా? అంటూ త్రిగుణ్ ప్రశ్నించారు.. ఈ కామెంట్స్‌తో తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన స్పష్టం చేసినట్లయింది. అయితే ఈ వ్యవహారం బ్లూ టీమ్‌లో విభేదాలను మరింత పెంచేలా కనిపిస్తోంది.
త్రిగుణ్ చేసిన పనిపై షాలిని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు రోహిత్ కూడా ఆయన తీరును తప్పుబట్టారు. సొంత టీమ్‌లో ఉంటూ ప్రత్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని వెన్నుపోటుగా అభివర్ణించినట్లు తెలుస్తోంది. దీంతో హౌస్‌లో టీమ్‌ల మధ్య పోటీతో పాటు సభ్యుల మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా తెరపైకి వచ్చాయి. బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ గెలవడం ఎంత ముఖ్యమో, టీమ్‌లోని సభ్యుల మధ్య నమ్మకం కూడా అంతే కీలకం. త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం గ్రీన్ టీమ్‌కు లాభం చేకూర్చినా, బ్లూ టీమ్‌లో మాత్రం అసంతృప్తికి కారణమైంది.
మరోవైపు కెప్టెన్సీ పోటీ కూడా ఆసక్తికరంగా సాగింది. గ్రీన్ టీమ్ అత్యధిక పాయింట్లు సాధించడంతో ఆ టీమ్ సభ్యులకు కెప్టెన్సీ పోటీలో అవకాశాలు లభించాయి. శివకుమార్ వద్ద అత్యధిక కాయిన్లు ఉండటంతో ఆయనకు కూడా పోటీలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ముకేశ్, వర్షిణి, వంశీ, శివకుమార్, రామ్ ప్రసాద్, అమన్, ఝాన్సీ పాల్గొన్నారు. గోడకు అమర్చిన మేకులపై నిలబడాల్సిన ఈ పోటీలో, ఇతర సభ్యులు కెప్టెన్ కాకూడదని భావించిన వారి మేకులను తొలగించవచ్చు. చివరి వరకు గోడపై నిలబడిన సభ్యుడు కెప్టెన్‌గా నిలిచేలా టాస్క్ నిర్వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

