Dunki Teaser | నలుగురు స్నేహితుల కథతో డంకీ.. ఆకట్టుకుంటున్న టీజర్
Dunki Teaser | ‘పఠాన్' ‘జవాన్' చిత్రాలతో ఈ ఏడాది భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర హీరో షారుఖ్‌ఖాన్. ఆయన రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం షారుఖ్‌ఖాన్ జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు.
Dunki Teaser | ‘పఠాన్’ ‘జవాన్’ చిత్రాలతో ఈ ఏడాది భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర హీరో షారుఖ్‌ఖాన్. ఆయన రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం షారుఖ్‌ఖాన్ జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునే నలుగురు స్నేహితుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లను హాస్యప్రధానంగా చూపించారు.
యధార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథలో ప్రేమ, స్నేహం గొప్పదనాన్ని ఆవిష్కరిస్తూ తనదైన శైలి ఎమోషన్స్‌తో తెరకెక్కించారు దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ. వినోదం, సందేశం ప్రధానంగా ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

