Shah Rukh Khan | కూతురికి గురువు పాత్రలో బాలీవుడ్ అగ్ర హీరో
అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినీ రంగంలో వడివడిగా అడుగులు వేస్తున్నది. ‘ది ఆర్చిస్' చిత్రం ద్వారా ఓటీటీ వేదికపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం హిందీలో ఓ భారీ సినిమాలో నటించబోతున్నది.
Shah Rukh Khan | అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినీ రంగంలో వడివడిగా అడుగులు వేస్తున్నది. ‘ది ఆర్చిస్’ చిత్రం ద్వారా ఓటీటీ వేదికపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం హిందీలో ఓ భారీ సినిమాలో నటించబోతున్నది. ‘కింగ్’ పేరుతో దర్శకుడు సుజయ్‌ఘోష్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారని తొలుత వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో షారుఖ్ పూర్తిస్థాయి పాత్రలో నటించనున్నారని, కుమార్తె సుహానాఖాన్‌తో సమాంతరంగా ఆయన పాత్ర సాగుతుందని తెలిసింది.
ఈ సినిమాలో వారిద్దరు తండ్రీకూతుళ్లుగా కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని.. సుహానాఖాన్కు మార్గదర్శనం చేసే శక్తివంతమైన గురువుగా షారుఖ్‌ఖాన్ పాత్ర సాగుతుందని చెబుతున్నారు. ‘ఈ సినిమా స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశాం. సుహానాఖాన్ తొలి థియేట్రికల్ రిలీజ్ కాబట్టి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. షారుఖ్‌ఖాన్‌తో సమానంగా సుహానాఖాన్ పాత్ర ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

