Ramaiya Vastavaiya | జవాన్ నుంచి నాట్ రామయ్యా వస్తావయ్యా సాంగ్ రిలీజ్.. షారుఖ్, నయనతార మాస్ డాన్స్
Ramaiya Vastavaiya | బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’(Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ramaiya Vastavaiya | బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’(Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌ను విడుదల చేశారు.
ఇప్పటికే జిందా బందా, ‘చలేయా’ అనే సాంగ్‌లతో ప్రేక్షకులను ట్రీట్ చేసిన జవాన్ మేకర్స్.. తాజాగా ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ (Not Ramaiyavastavaiya) అనే పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు. అప్పుడేమో చయ్యా చయ్యా రే.. ఇప్పుడేమో థా థా థైయా.. రామయ్యా… వస్తావయ్యా.. అంటూ సాగిన ఈ పాట హై-ఎనర్జీ సెలబ్రేషన్‌లా ఉంది. ఇక ఈ పాటపై షారుఖ్‌ఖాన్ స్పందిస్తూ.. ఇది చయ్యా చయ్యా కాదు. ఇది నాట్ రామయ్యా వస్తావయ్యా ఇది జవాన్ థా థా థైయా అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఇది చయ్యా చయ్యా కాదు. ఇది #NotRamaiyaVastavaiya. ఇది జవాన్ థా థా థైయా.
Idhi chaiya chaiiya Kadhu. Idhi #NotRamaiyavastavaiya. Idhi Jawan that tha thaiya.
Full Song out now!
Thx @anirudhofficial, @Sreeram_singer, @RakshitaaSuresh, @chandrabose4321, @VMVMVMVMVM#Jawan… pic.twitter.com/6VQ6zY3wkS
— Shah Rukh Khan (@iamsrk) August 29, 2023
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

