Shaakunthalam Movie | సమంతకు పరిక్ష.. శాకుంతలం గట్టెక్కుతుందా ?
Shaakunthalam Movie Collection | విజువల్ వండర్ అంటూ విడుదలకు ముందు వర్ణించిన శాకుంతలం సినిమాకు అదే మైనస్ అయిపోయింది. కళ్లకు స్పష్టంగా ఇది వీఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. ఇక గుణశేఖర్ టేకింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడకుంటే అంత మంచిది.
Shaakunthalam Movie Collection | విజువల్ వండర్ అంటూ విడుదలకు ముందు వర్ణించిన శాకుంతలం సినిమాకు అదే మైనస్ అయిపోయింది. సినిమా చూస్తుంటే కళ్లకు స్పష్టంగా ఇది వీఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. ఇక గుణశేఖర్ టేకింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడకుంటే అంత మంచిది. ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలను తెరకెక్కించిన గుణశేఖరేనా ఈసినిమా తీసింది అనిపిస్తుంది. పాటలు కూడా సినిమాను బతికించలేకపోయాయి. మొత్తంగా చూసుకుంటే శాకుంతలం ఎపిక్ డిజాస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మామాలుగా దిల్‌రాజు నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఈ సినిమా దిల్‌రాజు చూశాడా అనే భావన కూడా చాలా మందిలో ఉంది.
తొలిరోజు ఏమంత కలెక్షన్లు రాబట్టలేకపోయినా.. రెండవ రోజు కాస్త గ్రోత్ ఉందనుకుంటే రెండో రోజు మరింత దారుణంగా కలెక్షన్లు సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. మూడు రోజుల్లో శాకుంతలం సినిమా కేవలం మూడున్నర కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అది కష్టమని స్పష్టమవుతుంది. ఇది పక్కన పెట్టేస్తే ఈ సినిమాను ముందు నుంచి రూ.80 కోట్ల సినిమా అని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు.
ఈ లెక్కన చూసుకంటే నిర్మాతగా గుణశేఖర్‌కు ఈ సినిమా ఘోరంగా నష్టాలు తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది. ఎందుకుంటే శాటిలైట్ హక్కలు, డిజిటల్ హక్కులు ఇంకా అమ్ముడవలేదు. ఈ సినిమా ఫలితం బట్టి చూస్తే ముందు అనుకున్న దానికంటే తక్కువ రేటుకే ఈ సినిమా అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇక సినిమా విడుదల రోజు కనిపించిన గుణశేఖర్.. ఇప్పటివరకు మళ్లీ కనిపించలేదు. సమంత సైతం సైలెంట్ అయిపోయింది. యునానిమస్‌గా ఈ సినిమా తిరస్కారానికి గురి కావడంతో ఎవరూ ఏమి మాట్లాడలేదు. ఇక లైగర్, ఆచార్య వంటి టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్ట్‌లో శాకుంతలం చేరడం ఖాయమే అనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

