Shaakunthalam Movie | శాకుంతలం నుంచి మధుర గతం సాంగ్ రిలీజ్.. మెలోడి బ్రహ్మ మళ్లీ ట్రాక్ ఎక్కేసినట్టున్నాడుగా..!
'యశోద' వంటి కమర్షియల్ హిట్ తర్వాత 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం ఎన్నో అడ్డంకులు.
Shaakunthalam Movie | ‘యశోద’ వంటి కమర్షియల్ హిట్ తర్వాత ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం ఎన్నో అడ్డంకులు. ఈ మధ్య కాలంలో శాకుంతలం సినిమా వాయిదా పడినన్ని సార్లు మరే సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదేమో. మహాశివరాత్రికి పక్కా వస్తుందంటూ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కానీ పలు కారణాల వల్ల సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్ సంగతి పక్కన పెడితో ప్రమోషన్లలో మాత్రం మేకర్స్ జోరు చూపిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ప్రతీ వారం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని నాల్గోవ పాటను రిలీజ్ చేశారు. మధుర గతమా అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను అర్మాన్ మాలీక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. శ్రీమణీ సాహిత్యం అందించాడు. లేటెస్ట్గా రిలీజైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్‌లోని విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మణిశర్మ చాలా రోజుల తర్వాత తన స్థాయి ఆల్భమ్ ఈ సినిమాకు అందించాడు.
మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు మంచి బజ్ తెచ్చిపెట్టాయి. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. మోహన్ బాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ గెస్ట్ రోల్ పోషించింది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇటీవలే ఈ సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
నిజానికి గతేడాది దసరాకే ఈ సినిమా రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రోడక్షన్ ఇంకా పూర్తి కాలేదని వాయిదా వేశారు. ఆ తర్వాత దీపావళికి వస్తుందంటూ ప్రకటించారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేసి సామ్ అభిమానులను తీవ్రంగ నిరాశపరిచారు. ఇక మహాశివరాత్రికి కచ్చితంగా వస్తుందంటూ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ పఠాన్ జోరు కొనసాగుతుండటం, హిందీలో షెహజాదా అదే రోజున రిలీజవడంతో వెనక్కు తగ్గారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో సోలోగా రావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో విడుదల తేదీలో పలు మార్పులు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకైతే ఈ సినిమాక ఏప్రిల్ 14న పోటీ లేదు. రెండు వారాల తర్వాత అఖిల్ ఏజెంట్‌తో రానున్నాడు, సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ విడుదల కానుంది. ఈ లోపు శాకుంతలానికి కొంచె పాజిటీవ్ వచ్చినా.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు ఖాయం. చూడాలి మరి ఈ సారైనా రిలీజ్ డేట్ అదే ఉంటుందా? మారుతుందా? అని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

